Team India senior Cricketers backs Hardik Pandya
#HardikPandya
#t20worldcup
#Teamindia
#Bcci
#Sehwag
టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా కీలకం అని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. జట్టులో అతడు కీలక పాత్ర పోషిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. పాండ్యా మొదట బ్యాట్స్‌మన్ అనే విషయాన్ని ముందు మనం గుర్తుపెట్టుకోవాలని వీరూ సూచించాడు. ఐపీఎల్ 2020 ముందు హార్దిక్ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆపై కొంతకాలం పాటు జట్టుకు దూరమయ్యాడు. అయితే జట్టులోకి వచ్చినా.. బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా బౌలింగ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ స్పందించాడు.